Hyderabad metro special trains: హైదరాబాద్ నగరం గణేశ నిమజ్జన శోభాయాత్రతో సందడి చేయనుంది. 2025 సెప్టెంబర్ 6వ తేదీ శనివారం సాయంత్రం నుంచి నగరంలోని ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్‌తో పాటు గల్లీ గల్లీల్లో గణనాథుల నిమజ్జనం జరుగుతుంది. లక్షలాది భక్తులు ఈ వేడుకను వీక్షించేందుకు వస్తారు. అయితే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సర్వీసులు నడపనుంది.
సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 6 గంటలకు ఫస్ట్ రైలు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 1 గంట వరకు నాన్ స్టాప్ సర్వీసులు ఉంటాయి. ప్రతి స్టేషన్‌లో లాస్ట్ రైలు సెప్టెంబర్ 7న రాత్రి 1 గంటకే ఉంటుంది. దీంతో గణేష్ శోభాయాత్రను తిలకించాలనుకునే భక్తులకు మెట్రో సౌకర్యం సులభంగా లభిస్తుంది.
Internal Links:
ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో జాబ్స్..
కరీంనగర్‌లో సామాజిక కార్యకర్త వినూత్న నిరసన..
External Links:
గణేష్ నిమజ్జనం స్పెషల్ : హైదరాబాద్ మెట్రో నాన్ స్టాప్ సర్వీసులు : హ్యాపీగా శోభాయాత్రకు వెళ్లిరండి..!