భారత ప్రభుత్వం పహల్గామ్ ఘటన నేపథ్యంలో దేశంలో ఉన్న పాకిస్థానీలపై కఠిన చర్యలు చేపట్టింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు, రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అక్రమంగా ఉన్న పాకిస్థానీలను గుర్తించి, చర్యలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్‌లో తాజా తనిఖీల్లో నలుగురు పాకిస్థానీ పౌరులను పోలీసులు గుర్తించి, వారిని రేపటిలోగా నగరం విడిచిపెట్టాలని నోటీసులు ఇచ్చారు. వీరు షార్ట్ వీసాలతో ఉంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా, భాగ్యనగరంలో మొత్తం 213 మంది పాకిస్థానీలు ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.