హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భాగ్యనగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, మెదక్, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు వర్ష సూచన ఉందని తెలిపింది.
ఇదిలా ఉండగా, ఈరోజు సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.