హైదరాబాద్‌లో కొత్త గుర్తింపు తెచ్చేలా సాస్ క్రౌన్ పేరిట 57 అంతస్తులతో అతి ఎత్తైన భవంతి నిర్మాణం జరుగుతోంది. కోకాపేట్‌లో 4.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆకాశహర్మ్యానికి ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇందులో ప్రత్యేకతగా ఒక్కో అంతస్తుకు ఒకే ఫ్లాట్‌గా ఉండే విధంగా స్కై విల్లాస్ ఏర్పాటు చేశారు. భాగ్యనగర చరిత్రలో ఇదే ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత ఎత్తైన భవనం.
ఇదే తరహాలో హైదరాబాద్‌లో మరిన్ని ఆకాశహర్మ్యాల నిర్మాణం కూడా జరుగుతోంది. వేర్వేరు ప్రాంతాల్లో 62 అంతస్తుల వరకు భవనాలకు అనుమతులు దశలో ఉన్నాయి. వీటితో హైదరాబాద్ ఆకాశహర్మ్యాల రంగంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సాధిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై తర్వాత హైదరాబాద్ రెండో స్థానానికి చేరుకోవడం గర్వకారణం.