IMD Warning: దేశ వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురిసి పలు రాష్ట్రాల్లో తీవ్ర నష్టం కలిగించాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా కొన్ని రాష్ట్రాలు తేరుకోలేదు. ఈ పరిస్థితుల్లో కేంద్ర వాతావరణ శాఖ సెప్టెంబర్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని, అలాగే దక్షిణ హర్యానా, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్‌లో కూడా తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపింది. సగటున 167.9 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండవచ్చని, ఇది సాధారణ వర్షపాతం 109 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.
భారీ వర్షాల కారణంగా రవాణా మరియు ఇతర రంగాల్లో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాఖండ్‌లో నదులు ఉప్పొంగి నగరాలు, పట్టణాలు ప్రభావితం కావచ్చని, ఛత్తీస్‌గఢ్‌లో మహానది పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరగవచ్చని తెలిపింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, సెప్టెంబర్‌లో కూడా వర్షాలు అదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
Internal Links:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 1543 జాబ్స్
గ్రేటర్ హైదరాబాద్కు ఎల్లో అలెర్ట్ జారీ..
External Links:
సెప్టెంబర్‌లోనే అత్యధిక వర్షాలుంటాయి.. ఐఎండీ వార్నింగ్