Inter Exams Start Today: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి మార్చి 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1537 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి, 10.57 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. విద్యార్థులు కనీసం గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా హాల్‌లోకి అనుమతి ఇవ్వరు అని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, సరైన వెలుతురు వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు.
ప్రతి పరీక్ష గదిలో సీసీటీవీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసి, జిల్లా స్థాయి కమిటీలను కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఫ్లైయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీలు నిర్వహిస్తాయి. విద్యార్థులు సమయానికి చేరుకునేందుకు అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏఎన్ఎం, ఆశా వర్కర్లు అందుబాటులో ఉంటారు. ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 1531 కు కాల్ చేయాలని తెలిపారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
విషపూరితంగా మారిన కిడ్స్ సిరప్..
SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.
External Links:
నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఎగ్జామ్ హాల్స్‌లో సీసీ కెమెరాలు..