IRCTC ID Block

IRCTC ID Block: ప్రతిరోజూ రైల్వే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో జరుగుతున్న అవకతవకలను అరికట్టేందుకు రైల్వే శాఖ కీలక చర్యలు చేపట్టింది. IRCTC‌కు చెందిన 2.5 కోట్లకు పైగా యూజర్ ఐడీలను బ్లాక్ చేయడం ద్వారా తప్పుడు బుకింగ్స్‌కి అడ్డుకట్ట వేసింది. ఈ ఐడీలపై అనుమానాలు ఉన్నాయని, డేటా విశ్లేషణ ఆధారంగా బుకింగ్ ప్యాటర్న్, యూజర్ ప్రవర్తనను గమనించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పార్లమెంట్‌లో తెలిపింది. ఎంపీ ఏడీ సింగ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది. రైల్వే రిజర్వేషన్‌లో మోసాలను అరికట్టేందుకు డిజిటల్ సంస్కరణలను అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇందులో తత్కాల్ టికెట్లకు ఆధార్ ఆధారిత ధృవీకరణ, ఏజెంట్లపై మొదటి 30 నిమిషాల్లో బుకింగ్ నిషేధం, డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహం వంటి చర్యలు ఉన్నాయి.

ఇంకా రైల్వే శాఖ ఆగస్టు 1 నుంచి తత్కాల్ టికెట్లను కేవలం ఆధార్ అనుసంధానించిన వినియోగదారులకే అందుబాటులోకి తేర్చనున్నట్లు తెలిపింది. టికెట్ల కోసం PRS కౌంటర్లలో డిజిటల్ చెల్లింపు సౌకర్యం కల్పించనున్నారు. ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లు నడపడం, ట్రైన్ సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. వెయిట్‌లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు సులభంగా టికెట్లు అందించేందుకు వికల్ప్ (ఆల్టర్నేట్ ట్రైన్ అకామడేషన్) మరియు అప్‌గ్రేడేషన్ స్కీమ్‌లను అమలు చేస్తున్నారు. ఈ మార్గంలో రాబోయే రోజుల్లో రైల్వే టికెట్ బుకింగ్ మరింత సులభతరం కానుంది.

Internal Links:

విద్యార్థుల నేతృత్వంలోని బంద్ కారణంగా తెలంగాణలో పాఠశాలలు మూతపడ్డాయి.

మరో మూడు గంటలు భారీ వర్షాలు..

External Links:

రైల్వే కీలక నిర్ణయం.. ఇకపై టిక్కెట్ బుకింగ్ సులభంగా మారనుంది..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *