News5am, Latest Breaking News (13-06-2025): అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ దుర్మరణం చెందారు. ఆయన లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 241 మంది ప్రయాణికులు మరణించగా, ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. విమానం నివాసిత ప్రాంతాల్లో కూలిపోవడంతో అక్కడ కూడా ప్రాణనష్టం జరిగింది. ప్రారంభంలో విజయ్ రూపానీ ఆ విమానంలో లేరనే వార్తలు వచ్చినా, తరువాత ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో విషయం స్పష్టమైంది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఆయన మరణాన్ని అధికారికంగా ప్రకటించారు.
విమానం జనావాసాల్లో కూలడంతో మరింతగా ప్రాణనష్టం జరిగింది. బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై విమానం కూలిపోవడంతో విద్యార్థులు కూడా బలయ్యారు. ఈ ఘటనలో సుమారు 20 మంది చనిపోయినట్లు సమాచారం వచ్చిందప్పటికీ, అధికారులు ఐదుగురు మృతుల్ని నిర్ధారించి, 50 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అయితే, రూపానీ లండన్‌కు వెళ్లడానికి కారణం ఆయన భార్య. ఆమె గత ఆరు నెలలుగా లండన్‌లో ఉంటున్నారని సమాచారం. ఆమెను తిరిగి ఇండియాకు తీసుకురావడానికి విజయ్ రూపానీ లండన్ బయలుదేరారు. ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది.
More Latest Breaking:
Latest Breaking News:
ఆహ్మదాబాద్ విమాన ప్రమాదం – జూన్ 12, 2025
బేగంపేట- ప్యాట్నీ పరిధి ఆక్రమణలపై హైడ్రా అధికారుల కొరడా…
More Latest Breaking News: External Sources
ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సహా 241 మంది మృతి చెందారు.