Latest News Breaking

News5am, Latest News Breaking (27-05-2025): పాక్‌పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో భారత రక్షణ శాఖ మరో కీలక ముందడుగు వేసింది. అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రోగ్రాం ఎగ్జిక్యూషన్ మోడల్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. దీంతో భారత్‌ 5వ తరం స్టెల్త్-సెంట్రిక్ మల్టీరోల్ ఫైటర్ జెట్ నిర్మాణానికి సిద్ధమైంది. ఈ జెట్‌లో సెన్సార్ ఫ్యూజన్, ఇంటర్నల్ వెపన్ బేస్, అడ్వాన్స్‌డ్ ఏవియానిక్స్, సూపర్ క్రూయిజ్ సామర్థ్యాలతో కూడిన అత్యాధునిక సాంకేతికతలు ఉంటాయి. ఈ కార్యక్రమం దేశీయ ఏరోస్పేస్ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు తోడ్పడుతుందని, భారత స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించనుందని భావిస్తున్నారు. దీనిని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ భాగస్వామ్యంతో కేంద్రం చేపట్టింది.

ఈ ఎగ్జిక్యూషన్ మోడల్ పబ్లిక్ మరియు ప్రైవేట్ భాగస్వామ్యంతో రూపొందుతోంది. దీని ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలకు అవకాశాలు పెరగనున్నాయి. ఆసక్తి ఉన్న భారతీయ సంస్థలు స్వతంత్రంగా లేదా జాయింట్ వెంచర్లు, కన్సార్టియాల రూపంలో బిడ్డింగ్ చేయవచ్చు. అయితే, బిడ్ సమర్పించే సంస్థలు భారతీయ సంస్థలే అయి ఉండాలి మరియు దేశ చట్టాలు, నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని కేంద్రం స్పష్టం చేసింది.

More Latest News General:

Latest Breaking News in News5am

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..

కాన్వా డౌన్: వేలాది మంది వినియోగదారులు డిజైన్ యాప్‌ యాక్సెస్‌లో సమస్యలు ఎదుర్కొంటున్నారు

More Latest News Breaking: External Sources

5వ తరం ఫైటర్ జెట్ నిర్మాణానికి రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *