News5am, Latest News Telugu (07-06-2025): రాబోయే నాలుగు రోజుల్లో తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 7 (శనివారం) నుండి జూన్ 11 వరకు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో మెరుపులు, ఉరుములతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఎండ నుంచి ప్రజలకు ఉపశమనం లభిస్తుంది.
హైదరాబాద్ నగరంలో ఈ నాలుగు రోజులు వాతావరణం చల్లగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశం మేఘావృతంగా ఉండి, మంగళవారం (జూన్ 10) వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలకు తోడు ఈదురుగాలులు కూడా వీస్తాయని అంచనా వేసింది.
More Latest News Today:
News Telugu:
వాయుగుండంగా మారిని తీవ్ర అల్పపీడనం..
More Latest News: External Sources
తెలంగాణలో నాలుగురోజులు వర్షాలు..ఎల్లో అలెర్ట్ జారీ