News5am, Latest Telugu Breaking News_(29-05-2025): మహమ్మారి కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ భయం చెలరేగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళకు చికిత్స సమయంలో కోవిడ్ సోకినట్లు తేలింది. అలాగే, చిలకలూరిపేటకు చెందిన వృద్ధుడు, బాపట్లకు చెందిన మరో మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఈ ముగ్గురు బాధితుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వారి పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించి, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆసుపత్రి వైద్యులు ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు నివేదించారు. తాజా కేసులతో కలిపి ఏపీలో కేసుల సంఖ్య దాదాపు 10కి చేరుకుంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1000 దాటింది. అత్యధికంగా కేరళలో కేసులు నమోదు కాగా, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకలో కూడా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. బెంగళూరుకు చెందిన 84 ఏళ్ల వృద్ధుడు ఇటీవల మృతి చెందారు.
More Latest Telugu Breaking News:
Latest Telugu Breaking:
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు..
More Latest Telugu Breaking News: External Sources
ఏపీలో మరో మూడు కరోనా కేసులు.. గాయపడిన మహిళకు పాజిటివ్!