News5am, Latest Telugu Weather News (21-05-2025): రైతులకు శుభవార్త. ఈసారి నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను సాధారణ కాలానికి ముందు చేరుకోనున్నాయని సమాచారం. కేరళ తీరాన్ని కూడా వీటి ప్రభావం త్వరలోనే తాకనుంది. భారత వాతావరణశాఖ (IMD) ముందస్తు అంచనా ప్రకారం, ఈ నైరుతి రుతుపవనాలు ఐదు రోజులు ముందుగానే వచ్చే అవకాశముందని తెలిపింది. ప్రస్తుతం దక్షిణ, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. అలాగే ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాబోయే వారం రోజులలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, వైఎస్సార్ కడప, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
ఇప్పటికే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వర్షాలు పడుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నాయి. అయితే ఈసారి వర్షాకాలం విస్తారంగా ఉండబోతుందన్న వాతావరణశాఖ అంచనాలు రైతులకు ఉత్సాహాన్నిచ్చాయి. సమృద్ధిగా వర్షాలు పడతాయని భావిస్తూ రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
More Latest News:
Today Telugu Weather News:
హైదరాబాద్ వాసులకు IMD బిగ్ అలర్ట్..
తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు..
More Today Telugu News: External Sources
చల్లని కబురు.. ఏపీకి ముందుగానే నైరుతి రుతుపవనాలు