LIC HFL Recruitment 2025: ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు మంచి వార్త అందించింది. ఐటీ నిపుణులు, అప్రెంటిస్‌ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఫుల్ స్టాక్ డెవలపర్ (అసిస్టెంట్ మేనేజర్ కేడర్) ఒక పోస్టు, SAP ప్రొఫెషనల్ (అసోసియేట్ కేడర్) ఒక పోస్టు ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు సంవత్సరానికి రూ. 19.15 లక్షల వరకు జీతం లభిస్తుంది. ఈ పోస్టులకు MCA, M.Tech లేదా తత్సమానం డిగ్రీ 60% మార్కులతో పూర్తి సమయం చదివి ఉండాలి. 28–35 ఏళ్ల వయసులో ఉండి, ఐటీ సేవల్లో కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి. SAP ప్రొఫెషనల్ పోస్టుకు MCA, BE, B.Tech, లేదా B.Sc.లో 60% మార్కులు ఉండాలి. 24–30 ఏళ్ల వయసులో ఉండి, కనీసం 3 ఏళ్ల SAP అనుభవం ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ జీతం రూ. 16.50–19.15 లక్షలు, SAP ప్రొఫెషనల్ జీతం రూ. 10.40–11.82 లక్షల వరకు లభిస్తుంది. ఎంపిక ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. దరఖాస్తు గడువు సెప్టెంబర్ 15, 2025. ఆన్‌లైన్ టెక్నికల్ టెస్ట్ (తాత్కాలిక) సెప్టెంబర్ 25న ఉంటుంది. అదనంగా, భారతదేశవ్యాప్తంగా 192 మంది అప్రెంటిస్‌లను నెలకు రూ. 12,000 స్టైఫండ్‌తో నియమిస్తున్నారు. వీటి కోసం దరఖాస్తు గడువు సెప్టెంబర్ 22, పరీక్ష ఫీజు చెల్లింపు గడువు సెప్టెంబర్ 24, పరీక్ష అక్టోబర్ 1, 2025న జరగనుంది.
Internal Links:
కేంద్ర ప్రభుత్వ సంస్థలో 325 జాబ్స్…
External Links:
ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో జాబ్స్.. ఏడాదికి రూ. 19 లక్షల జీతం.. అర్హులు వీరే