రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం కన్వీనర్‌ కోటా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కన్వీనర్ కోట సీట్లతో పాటు తిరుపతి శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల అడ్మిషన్లకు సంబంధించిన సీట్లను భర్తీ చేయనున్నారు. నీట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 16 చివరి తేదీగా నిర్ణయించారు. https://drntr.uhsap.in/index/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 10 ప్రభుత్వ, 11 ప్రైవేటు వైద్య కళాశాలలు ఉండగా, ఎస్వీయూ పరిధిలో 6 ప్రభుత్వ, 7 ప్రైవేటు వైద్య కళాశాలలు ఉన్నాయి. మొత్తం 35 మెడికల్ కాలేజీల్లో 6,210 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, కన్వీనర్ కోటా కింద 3,856 సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం సీట్లు ఇండియా కోటా కింద భర్తీ చేయబడతాయి. మిగిలిన 85 శాతం సీట్లను రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే ఓసీ, బీసీ విద్యార్థులు రూ.2,950 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు రూ.2,360 దరఖాస్తు రుసుం చెల్లించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *