టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన సతీమణి సాక్షితో కలిసి చేసిన సంప్రదాయ నృత్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అవుతోంది. ఇటీవల ధోనీ తన కుటుంబంతో కలిసి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో, రిషికేశ్‌లో స్థానికులతో కలిసి ధోనీ దంపతులు సంప్రదాయ పాటలతో కాలు కదిపారు. ‘గులాబీ షరారా’ మరియు ‘పహడీ’ పాటలకు ధోనీ, సాక్షి నృత్యం చేస్తున్న దృశ్యాలు వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో ధోనీ అభిమానులకు ముచ్చటగా మారి, వారు దీనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.