Narendra Modi in Visakhapatnam: ప్రస్తుతం ప్రపంచం వివిధ ఘర్షణలు, అశాంతి, అస్థిరతలతో బాధపడుతున్న సమయంలో, యోగా శాంతి పథాన్ని(Yoga for One Earth, One Health) సూచిస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ జాతీయ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం “మానవాళి కోసం యోగా 2.0” అనే థీమ్‌పై ప్రారంభమవాలని, అంతర్గత శాంతి అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అమలయ్యే విధానంగా మారాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.
విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద మూడు లక్షల మందికిపైగా ప్రజలతో కలిసి ప్రధాని మోదీ కామన్ యోగా ప్రోటోకాల్ (CYP) లో పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఆయన యోగా ఆనందం, శాంతిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రపంచం విభిన్న సమస్యలతో కంగారుపడుతున్న వేళ, యోగా మనలను శాంతి వైపు నడిపించగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. “ప్రపంచం నేడు ఉద్రిక్తతలతో, అశాంతితో ఎదుర్కొంటోంది. చాలా ప్రాంతాల్లో అస్థిరత పెరుగుతోంది. అటువంటి వేళలో యోగా మన మనస్సుకు విశ్రాంతిని ఇవ్వగల శక్తివంతమైన సాధన. ఇది మనలో సమతుల్యాన్ని తీసుకురావడమే కాకుండా, మానవత్వానికి జీవ శక్తిని ఇస్తుంది” అని మోదీ అన్నారు.
యోగా కేవలం వ్యక్తిగత అభ్యాసంగా కాకుండా, ప్రపంచ సమాజాన్ని సమైక్యంగా ఉంచే మాధ్యమంగా మారాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రతి దేశం, ప్రతి సమాజం యోగాను తమ దైనందిన జీవన విధానంలో భాగంగా చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, యోగా అనేది వ్యాయామం మాత్రమే కాదని, అది ఒక సంపూర్ణ జీవన విధానమని స్పష్టం చేశారు. “యోగా అంటే కలిపే శక్తి. ఇది ప్రపంచాన్ని కలిపిన మానవత్వ సూత్రం” అని ప్రధాని మోదీ గర్వంగా పేర్కొన్నారు.
Internal Links:
ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందడి..
అర్హతతో రైల్వే జాబ్ కొట్టే ఛాన్స్..
External Links:
ప్రపంచ శాంతికి యోగా దిక్సూచి.. విశాఖ యోగా డేలో ప్రధాని మోదీ