New Rule for 10th and Inter Students

New Rule for 10th and Inter Students: CBSE బోర్డు 2025-26 విద్యా సంవత్సరానికి టెన్త్, ఇంటర్ విద్యార్థుల అటెండెన్స్ పై కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. 2026 బోర్డు పరీక్షలు రాయాలంటే కనీసం 75% హాజరు తప్పనిసరి. అనారోగ్యం, అత్యవసర వైద్య పరిస్థితులు, కుటుంబ సభ్యుల మృతి, జాతీయ లేదా అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనడం వంటి సందర్భాల్లో మాత్రమే మినహాయింపు ఉంటుంది. అటెండెన్స్ డేటా తారుమారు చేసినా లేదా రికార్డులో తేడాలు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటారు. అనుమతి లేకుండా గైర్హాజరైతే అటెండెన్స్ కోత పడుతుంది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లిదండ్రులు, విద్యార్థులకు అటెండెన్స్ నియమాలు మరియు వాటిని పాటించకపోతే జరిగే పరిణామాలు తెలియజేయాలి.

అటెండెన్స్ తక్కువగా ఉంటే రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా పోస్టు ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి. జనవరి 1 నుండి హాజరు లెక్కించాలి. జనవరి 7 లోపు అటెండెన్స్ తక్కువ ఉన్న కేసులను బోర్డుకు సమర్పించాలి. CBSE అనుబంధ స్కూళ్లలో చెకింగులు చేస్తుంది. రికార్డులు సమయానికి పూర్తి చేయకపోతే స్కూల్స్ అనుబంధాన్ని రద్దు చేయవచ్చు లేదా విద్యార్థులను అనర్హులుగా ప్రకటించవచ్చు.

Internal Links:

ఎస్బీఐలో 6,589 క్లర్క్ ఉద్యోగాలు..

అవయవ దానంలో తెలంగాణ ఫస్ట్..

External Links:

టెన్త్, ఇంటర్ విద్యారులకు కొత్త రూల్.. అటెండేన్స్ లేకుంటే నో ఎగ్జామ్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *