సి.పి. రాధాకృష్ణన్ మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియమితులయిన జార్ఖండ్‌తో పాటు తెలంగాణకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన ఆయనకు రేవంత్‌రెడ్డి శాలువా, జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఇటీవల తెలంగాణ గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించిన సంగతి తెలిసిందే. జిష్ణుదేవ్ 2018 నుంచి 2023 వరకూ త్రిపుర డిప్యూటీ సీఎంగా పని చేశారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ బుధవారం ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలను చేపట్టనున్నారు. రాజ్‌భవన్‌లో సాయంత్రం 5.03 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే నూతన గవర్నర్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, హైకోర్టు జడ్జీలు హాజరు కానున్నారు.