విజయవాడలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ వర్షాలకు మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఓ బాలిక మృతి చెందింది, పలువురికి గాయాలయ్యాయి. ఓ ఇల్లు పూర్తిగా, మరికొన్ని ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఆ ఇంట్లో పలువురు చిక్కుకుపోయారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో వెంటనే స్థానికులు అప్రమత్తం అయ్యారు
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగిస్తూ లోపల చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాలలో చిక్కుకున్న ఓ యువతిని బయటకు తీస్తున్న వీడియో హృదయవిదారకంగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *