ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఇతర కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్‌కు గురువారం నాటికి 7,706 దరఖాస్తులు వచ్చాయని పీజీఈసెట్‌కు కన్వీనర్ అరుణకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 14 పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తున్నందున, ఫార్మసీకి అత్యధికంగా 3,179 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 1,984, ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో 761, సివిల్ ఇంజినీరింగ్ లో 631, ఎలక్ర్టికల్ ఇంజినీరింగ్ లో 485, మెకానికల్ ఇంజినీరింగ్ లో 238 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు.రూ.1000 ఫైన్‌తో శుక్రవారం వరకు, రూ.2,500 ఫైన్ తో ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.