PGCIL Recruitment 2025: నిరుద్యోగులకు శుభవార్తగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1543 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఫీల్డ్ ఇంజనీర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థల నుంచి BE, BTech, BSc ఇంజనీరింగ్‌లో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులు కావాలి. గరిష్ట వయస్సు 29 సంవత్సరాలు కాగా, రిజర్వేషన్ కేటగిరీలకు వయోపరిమితి సడలింపులు ఉన్నాయి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో టెక్నికల్, ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ సబ్జెక్టులపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు ఇస్తారు, నెగటివ్ మార్కింగ్ ఉండదు.
ఫీల్డ్ ఇంజనీర్ పోస్టుకు ఎంపికైన వారికి రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు, ఫీల్డ్ సూపర్‌వైజర్‌కు రూ.23,000 నుంచి రూ.1,05,000 వరకు జీతం లభిస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 17, 2025 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
Internal Links:
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్, 3.0 వచ్చేస్తోంది..
రాబోయే 3 గంటల్లో భారీ వర్షాలు..
External Links:
BTech పాసైతే చాలు.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 1543 జాబ్స్ రెడీ..