లావణ్య-రాజ్ తరుణ్ కేసు హాట్ టాపిక్ గా నడుస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ త‌రుణ్‌, లావ‌ణ్య వ్య‌వ‌హారంలో తాజాగా పోలీసులు మ‌రో ట్విస్ట్ ఇచ్చారు. శుక్రవారం పోలీసులు రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇటీవలే లావణ్య పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. లావ‌ణ్య ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఆమెతో రాజ్ త‌రుణ్‌ ప‌దేళ్లు స‌హ‌జీవ‌నం చేసినట్లు పేర్కొన్నారు.

వాళ్లిద్ద‌రూ ఒకే ఇంట్లో ఉన్న‌ట్లు త‌మ‌ ప్రాథ‌మిక విచార‌ణ‌లో నిర్ధార‌ణ అయింద‌ని చార్జిషీట్‌లో తెలిపారు. అలాగే లావ‌ణ్య చెప్పిన దాంట్లో వాస్త‌వాలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు. లావ‌ణ్య ఇంటి వ‌ద్ద పోలీసులు సాక్ష్యాలు సేక‌రించారు. కాగా, ఇప్ప‌టికే ఈ కేసులో రాజ్ త‌రుణ్ ముంద‌స్తు బెయిల్ తీసుకున్నారు. రాజ్ తరుణ్‌పై ఛార్జ్ షీట్ దాఖలు చేయడం శుభ పరిణామమని తెలిపింది. తనను ఎన్నో మాటలు అన్నారని, చివరికి న్యాయం గెలుస్తుందని తాను భావిస్తున్నానని పేర్కొంది. రాజ్ తరుణ్‌కి వ్యతిరేకంగా వెళ్లాలని తనకు లేదని, తనకు రాజ్ తరుణ్ కావాలని పేర్కొంది. రాజ్ తరుణ్ ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత మానసికంగా ఎంతో బాధపడ్డానని వెల్లడించింది. శేఖర్ భాష అనే వ్యక్తిని అస్త్రంగా ఉపయోగించి తనపై ఎన్నో నిందలు వేశారని లావణ్య పేర్కొంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *