Priya Nair: ప్రియా నాయర్, ప్రస్తుతం వ్యాపార ప్రపంచంలో ఈ పేరు మార్మోగుతోంది. హిందూస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) కొత్త సీఈవోగా, ఎండీగా ఆమెను నియమించడంతో అందరి దృష్టి ఆమెపై కేంద్రీకృతమైంది. కంపెనీ 92 ఏళ్ల చరిత్రలో తొలి మహిళా సీఈవోగా రికార్డు సృష్టించనున్నారు. ప్రస్తుతం హెచ్‌యూఎల్ సీఈవోగా ఉన్న రోహిత్ జావా పదవీకాలం జూలై 31తో ముగుస్తుండగా, ఆగస్టు 1న ప్రియా నాయర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. బోర్డు సభ్యురాలిగా కూడా ఆమె నియమితురాలవుతారు. ప్రస్తుతం యూనిలీవర్‌లో బ్యూటీ & వెల్‌బీయింగ్ విభాగానికి ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. యూనిలీవర్ లీడర్‌షిప్ ఎగ్జిక్యూటివ్ (ULE) బృందంలోనూ ఆమె కొనసాగుతారు.
1995లో హెచ్‌యూఎల్‌లో ప్రవేశించిన ప్రియా నాయర్ హోమ్ కేర్, బ్యూటీ, పర్సనల్ కేర్ వంటి అనేక విభాగాల్లో కీలక నాయకత్వ పాత్రలు పోషించారు. కన్జూమర్ ఇన్‌సైట్స్ మేనేజర్‌గా పని చేసిన ఆమె, డోవ్, రిన్, కంఫర్ట్ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు బ్రాండ్ మేనేజర్‌గా సేవలందించారు. లాండ్రీ బిజినెస్‌తో పాటు ఓరల్ కేర్, డియోడరెంట్స్, కస్టమర్ డెవలప్‌మెంట్ విభాగాలన్నింటినీ విజయవంతంగా నడిపించారు. విద్యార్థిగా ముంబైలోని సిడెన్‌హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ & ఎకనామిక్స్ నుంచి బీకామ్ పూర్తిచేసిన ప్రియా, పూణెలోని సింబయోసిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ చేశారు. అనంతరం హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ & మేనేజ్‌మెంట్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా పూర్తిచేశారు.
Internal Links:
విశాఖ యోగా డేలో ప్రధాని మోదీ..
తల్లికి ఫోన్ చేసిన నిమిషాల తర్వాత, డాక్టర్ ముంబై సీ లింక్ నుండి దూకాడు..
External Links:
హిందుస్థాన్ యూనీలీవర్ సీఈవోగా ప్రియా నాయర్.. ఇంతకీ ఎవరీమె?