హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంజాగుట్టలోని థియేటర్ పైకప్పు నుండి నీరు లీకైంది. దీంతో థియేటర్ సిబ్బంది సినిమా స్క్రీనింగ్ ని నిలిపివేశారు. సినిమాని మధ్యలో ఆపేయడంతో ప్రేక్షకులు థియేటర్ సిబ్బందితో గొడవకు దిగారు. ప్రేక్షకులు తాజా హిట్ చిత్రం కల్కి 2898 ADని చూస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. మీడియా కథనాల ప్రకారం.. స్క్రీనింగ్ పాజ్ చేసిన తర్వాత సినీ ప్రేక్షకులు థియేటర్ సిబ్బందితో గొడవకు దిగారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. షార్ట్‌సర్క్యూట్ లేదా ఇంకేదైనా ఊహించని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ప్రేక్షకులు ప్రశ్నించారు.
సినిమా చూడకపోతే థియేటర్ నుంచి వెళ్లిపోవాలని పీవీఆర్ సిబ్బంది ఘర్షణకు దిగడంతో, ప్రేక్షకులు మరింత కోపోద్రిక్తులై, న్యాయం కోసం అధికారులను సంప్రదించినట్లు తెలిపారు. థియేటర్ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా వర్షం నీటి లీకేజీ అయింది అని వారు ఆరోపిస్తున్నారు.