ప్రముఖ తెలుగు యంగ్ నటుడు రాజ్ తరుణ్ మరియు లావణ్య ప్రేమ వ్యవహారం రెండు తెలుగు రాష్టాలలో చర్చగా మారిన విషయం తెలిసిందే. లావణ్య , రాజ్ తరుణ్ తనతో గత 11 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారని, వారిద్దరూ కలిసి ఓ ఇంట్లో ఉంటున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మహిళ పేర్కొంది. మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ఫిర్యాదులో పేర్కొంది. రాజ్ తరుణ్ మరియు మాల్వి కలిసి తిరుగుతున్నారని మరియు గోవా, పుదుచ్చేరి, చెన్నై మరియు ఇతర ప్రాంతాలకు తరచుగా కలిసి వెళుతున్నారని ఆమె ఆరోపించారు.

ఇటీవల పోలీసులు ఆ కేసు పై దర్యప్తు చేపడుతున్నారు అందులో భాగంగా తాజాగా సినీనటుడు రాజ్‌తరుణ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీ లోపు సినీనటుడు రాజ్‌తరుణ్ విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. హీరో రాజ్ తరుణ్ తనను నమ్మించి పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. తనను నమ్మించి మోసం చేసాడని ,తనను డ్రగ్స్ కేసులో కూడా ఇరికించాడని, తాను 43 రోజుల పాటు జైలులో ఉండాల్సి వచ్చిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఫిర్యాదు లో పేర్కొన్న భాగంగా పోలీసులు దీనికి సంబంధించిన ఆధారాలు ఇవ్వాలంటూ లావణ్యను కోరారు. ఆమె తన వద్ద ఉన్న ఆధారాలను నార్సింగ్ పోలీసులకు ఇచ్చింది. ఇచ్చిన ఆధారాల ప్రకారం రాజ్ తరుణ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *