తెలంగాణ ప్రజలకు ఉక్క‌పోత నుండి ఉపశమనం క‌లిగించేలా వాతావరణ శాఖ చ‌ల్ల‌ని క‌బురు చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. భూ ఉప‌రిత‌లం వేడెక్క‌డంతోనే ఈ వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది.

ఏప్రిల్ 1 నుండి 3 వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 2, 3 తేదీల్లో వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *