వరుసగా జరగుతున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులను కలవరపెడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే తాజాగా, శనివారం తెల్లవారుజామున 2.32 నిమిషాలకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో వారణాసి నుంచి అహ్మదాబాద్‌కు వెళ్తున్న సబర్మతి ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక బండరాయిని రైలు ఇంజిన్ ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా నిర్ధారించారు.

ఈ ప్రమాదంలో మొత్తం 22 బోగీలు పట్టాలు తప్పి ఒక వైపునకు ఒరిగాయి. ఈ అనుకోని దుర్ఘటనలో చాలా మంది ప్రయాణికులకు స్వల్వగాయలైనట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ఈ నేపథ్యంలో ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు అధికారులు ప్రత్యమ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *