SBI Clerk Recruitment 2025: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త అందించింది. క్లర్క్ (జూనియర్ అసోసియేట్) పోస్టుల కోసం 6,589 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో 5,180 రెగ్యులర్, 1,409 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ వారు డిసెంబర్ 31, 2025 లోపు డిగ్రీ పూర్తి చేయాలి. వయస్సు ఏప్రిల్ 1, 2025 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి (ఏప్రిల్ 2, 1997 – ఏప్రిల్ 1, 2005 మధ్య జననతేదీ). ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రిలిమినరీ, మెయిన్స్, లాంగ్వేజ్ ఎఫిషియెన్సీ టెస్టుల ఆధారంగా జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ 2025లో, మెయిన్స్ పరీక్ష నవంబర్ 2025లో నిర్వహించనున్నారు. జీతం నెలకు రూ.24,050 నుంచి రూ.64,480 వరకు లభిస్తుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750 కాగా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ వర్గాలకు ఫీజు లేదు. ఆగస్టు 6 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 26లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక లింక్‌ను చూడవచ్చు.
Internal Links:
ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. బస్సు చార్జీల తగ్గింపు..
External Links:
ఎస్బీఐలో 6,589 క్లర్క్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి