తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది. మద్యం దుకాణాలు, బార్‌లు మినహా అన్ని రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలు తెల్లవారుజామున ఒంటి గంట వరకు దుకాణాలు తెరుచుకునే వీలు కల్పించింది. మద్యం పట్ల తాము కఠినంగా ఉంటానని తెలిపారు. మద్యం షాప్ తెరిచి ఉంచినత సేపు, ప్రజలు మద్యం సేవిస్తూనే ఉంటారన్నారు. అందుకే మద్యం షాపులు ప్రస్తుతం ఉన్న సమయం వరకే తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు.
పర్యాటకులు ఎక్కువగా రాత్రి వేళలో షాపింగ్ చేయడానికి ఇష‌్టపడుతుంటారు. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా పాత బస్తీ ఏరియాల్లో 11 గంటలకే పోలీసులు వచ్చి షెట్టర్లు మూసేయాలంటూ వ్యాపారస్తులను ఒత్తిడి చేస్తున్నట్టు అయితే దీనిపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపీ అసెంబ్లీలో అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఒంటి గంట వరకు వ్యాపారాలు చేసుకోవచ్చని అనుమతి ఇచ్చేశారు. దీంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, చిరు వ్యాపారులు, పాతబస్తీ యువత సహా వ్యాపార వర్గాలు ఊపిరి పీల్చుకున్నారు.