SLBC టన్నెల్ లో 13 వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మృత దేహాల కోసం మార్క్ చేసిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో పాటు డీ వాటరింగ్ కొనసాగుతున్నాయి. TBM మిషన్ ను ప్లాస్మా కట్టర్ లతో రెస్క్యూ బృందాలు కట్ చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ మళ్ళీ మోరాయించడంతో నిలిచిన మట్టి తరలింపు ప్రక్రియ జరుగుతుంది. అలాగే, SLBC టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ లో ఇకపై రోబోలు పాల్గొననున్నాయి.

ఇక, SLBC టన్నెల్ వద్దకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ చేరుకుంది. హైదారాబాద్ కి చెందిన NV రోబోటిక్స్ తో కలిసి టన్నెల్ లోపల పరిశీలించిన అధికారులు. రోబోల వినియోగం సాధ్యం అవుతుందా లేదా అనే విషయమై సమీక్ష నిర్వహిస్తున్నారు. అవసరమైతే రోబోలు వాడాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో అధికారులు మరో ప్రయత్నం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *