హైదరాబాద్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా భూమి పొరల నుంచి పొగలు వచ్చి బీభత్సం సృష్టించాయి. ఈ ఘటన గురువారం కేబీఆర్ పార్క్‌లో చోటుచేసుకుంది. ఇది చూసిన జనం ఆశ్చర్యపోయారు. మొదట తక్కువగా వచ్చిన పొగలు, ఆ తర్వాత క్రమంగా పెరిగినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా తాజాగా విద్యుత్ శాఖ అదే ప్రాంతంలో భూగర్భంలో 11కేవీ కేబుల్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పొగలు ఎగసిపడి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. అయితే పొగ రావడానికి అసలు కారణాలు తెలియాల్సి ఉంది.