Social worker protests

Social worker protests: పోలీసులు వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే హెల్మెట్ లేకపోవడం, లైసెన్స్ లేకపోవడం, ఆర్‌సీ లేకపోవడం, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోవడం, రెడ్ సిగ్నల్ దాటడం, ట్రిపుల్ రైడింగ్, ఓవర్‌లోడ్, డ్రంకెన్ డ్రైవింగ్ వంటి కారణాలతో జరిమానాలు వేస్తుంటారు. ఇవన్నీ ప్రజల భద్రత కోసం తెచ్చిన నియమాలే అయినా, తప్పు చేసిన వారికి ఫైన్ తప్పదు. అయితే, కరీంనగర్‌లో ఒక ద్విచక్రవాహనదారుడు రోడ్డుపై గుంతలు ఉన్న కారణంగా వినూత్న నిరసన చేపట్టాడు. నిబంధనలు పాటించకపోతే మాకు ఫైన్ వేస్తారు, మరి రోడ్లు బాగులేకపోతే మీరు మాకు జరిమానా ఎంత చెల్లిస్తారు అని ప్రశ్నిస్తూ రేకుర్తి చౌరస్తా వద్ద రోడ్డుపై కూర్చున్నాడు.

సామాజిక కార్యకర్త కోట శ్యామ్ కుమార్ ఈ నిరసనలో హెల్మెట్ ధరించి గుంతల మధ్య కూర్చుని అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపాడు. ప్రజలు ప్రభుత్వానికి వాహన పన్నులు, రోడ్డు పన్నులు చెల్లిస్తున్నారని, కానీ రోడ్ల మరమ్మతు చేయడంలో అధికారులు శ్రద్ధ చూపడం లేదని ఆయన విమర్శించారు. దెబ్బతిన్న రోడ్లు వాహనాలను దెబ్బతీయడంతో పాటు ప్రజల ఆరోగ్యానికీ హాని కలిగిస్తున్నాయని, కలెక్టర్, పోలీసు కమిషనర్‌లపై ప్రశ్నలు లేవనెత్తాడు. చివరికి పోలీసులు వచ్చి విషయం పై అధికారులకు చెబుతామని చెప్పడంతో ఆయన ఆందోళన విరమించాడు. అయితే, ఈ ఘటన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Internal Links:

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం…

కేంద్ర ప్రభుత్వ సంస్థలో 325 జాబ్స్…

External Links:

మాకు చలానా వేస్తారు కదా..? ఇప్పుడు నాకు ఫైన్‌ కట్టండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *