ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల ముందు విచారణకు శ్రవణ్ రావు హాజరయ్యారు. గత విచారణ సందర్భంగా, ఈరోజు విచారణకు హాజరు కావాలని శ్రవణ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. అలాగే, తాను 2023లో ఉపయోగించిన మొబైల్ ఫోన్‌లను తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొంది.
అయితే, ఐదు రోజుల క్రితం శ్రవణ్ రావును దాదాపు ఏడు గంటల పాటు సిట్ ప్రశ్నించగా, అతను సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో తిరిగి విచారణకు పిలిచారు. ఇక, నేటి విచారణ సమయంలో సిట్ అధికారులు శ్రవణ్ రావును ఏ ప్రశ్నలు అడుగుతారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.