సెలవులను ఎవరు ఇష్టపడరు? సెలవుల కోసం హాస్టళ్లలో చదివే విద్యార్థులు, అందరూ ఆసక్తి చూపుతున్నారు. సెలవులు వస్తే ఇంటికి వెళ్లి అమ్మ వంట తిని, సరదాగా గడపాలని అనుకుంటారు. వారికి ఆగస్టు నెలలోనే ఎక్కువ సెలవులు వచ్చాయి. రెండవ శనివారం, స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు ఇంకా కొన్ని పండగలకు సంబంధించిన సెలవులతో మొత్తం 8 సెలవలు ఉన్నాయి.
సెలవ తేదీలు:
10- రెండొవ శనివారం
11- ఆదివారం
15-స్వాతంత్య్ర దినోత్సవం
16- వరలక్ష్మి వ్రతం
18- ఆదివారం
19- రక్షా బంధన్
25- ఆదివారం
26- శ్రీకృష్ణ జన్మాష్టమి
ఆగస్టు 15, 16, 18, 19 తేదీలు అంటే 17వ తేదీ తప్పా వరుసగా 4 రోజుల సెలవులు రానున్నాయి. మధ్యలో శనివారం వున్న ఆ ఒక్కరోజు హాలిడే ఇస్తే వరుసగా 5 సెలవులు వచ్చే అవకాశం ఉంది.