తాజాగా ఒడిశాలోని గంజాం జిల్లాలో ఓ ఆయిల్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. టీ దుకాణంలోకి ఆయిల్ ట్యాంకర్ దూసుకెళ్లిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బస్సుని ఓవర్ టేక్ చేయబోయిన ట్యాంకర్ టీ దుకాణంలోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.