తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతి వేదికగా ఫలితాలను ప్రకటించారు. ఈసారి 98.2% ఉత్తీర్ణత శాతం నమోదై, రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నడూ లేని రికార్డు స్థాయిలో విజయవంతం సాధించారు. రెసిడెన్షియల్ స్కూల్స్‌లో మరింతగా 98.7% ఉత్తీర్ణత నమోదైందని అధికారులు తెలిపారు.
ఈసారి మార్కుల మెమోలో కీలక మార్పులు చేశారు. గ్రేడ్లు, సీజీపీఏలతో పాటు రాత పరీక్షలు, ఇంటర్నల్ మార్కులు విడిగా చూపిస్తూ మొత్తం మార్కులను పేర్కొన్నారు. కనీస మార్కులు వచ్చినవారిని పాస్‌గా, లేకపోతే ఫెయిల్‌గా గుర్తించారు. ఈ పరీక్షల్లో 5,09,403 మంది విద్యార్థులు పాల్గొన్నారు, వారిలో 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు.