బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సిట్ చీఫ్ ఆఫీసర్‌గా ఐజి రమేష్ నియమితులయ్యారు. ఇందులో సభ్యులుగా ఎస్పీలు సింధు శర్మ , వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీలు చంద్రకాంత్ మరియు శంకర్ ఉన్నారు.
బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే 25 మంది ప్రముఖులపై పంజాగుట్ట, సైబరాబాద్, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఇప్పుడు సిట్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై నెలన్నర రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని డీజీపీ జితేందర్ సిట్ ను ఆదేశించారు.