హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై ఇటీవల చెలరేగిన వివాదంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వివాదంలో కొంతమంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నకిలీ వీడియోలు మరియు తప్పుడు ఫోటోలను ప్రసారం చేస్తున్నారు. ఈ ఫేక్ ప్రచారంలో యూనివర్సిటీ భూములను అక్రమంగా ఆక్రమించారని, పర్యావరణాన్ని ధ్వంసం చేశారనీ, వన్యప్రాణులకు నష్టం వాటిల్లిందంటూ ఊహాగానాలు వ్యాప్తి చెయ్యడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై సీరియస్‌గా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ తప్పుడు ప్రచారంపై చట్టపరంగా కోర్టుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. దీనితో, ఈ కేసు ఈరోజు విచారణ చేపట్టారు.
HCU భూ వివాదానికి సంబంధించిన కేసు ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉంది. ఈ అంశంపై విచారణను హైకోర్టు ఇటీవల ఈ నెల 24కి వాయిదా వేసింది. డివిజన్ బెంచ్ వ్యాఖ్యానిస్తూ, ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నదని పేర్కొంది. అలాగే కోర్టుకు కౌంటర్, రిపోర్ట్‌ను ఈ నెల 24 లోగా సమర్పించాలని సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ పరిణామాలతో, హైదరాబాద్ యూనివర్సిటీ భూ వివాదం మరింత కీలకంగా మారింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ అధికారులు సిద్ధమవుతున్నారు. విచారణ సందర్భంగా న్యాయపరమైన నివేదికలు, వాస్తవ ఆధారాలతో కూడిన వివరాలు కోర్టుకు సమర్పించనున్నారు.