తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి అని హైదరాబాద్ వాతావరణ శాఖ సమాచారం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. 2024, ఆగస్టు 1 సాయంత్రం, తర్వాత పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు తెలంగాణ, హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని పేర్కొంది. వర్షం పడుతున్న సమయంలో చెట్ల కిందకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి అని తెలిపారు.