Telangana Heavy Rains Yellow Orange Alert

Telangana Heavy Rains Yellow Orange Alert: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ సహా జగిత్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశంతో, ఆగస్టు 13 నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. హనుమకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేయగా, మిగతా జిల్లాల్లో కూడా భారీ వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో అధికారులు అలర్ట్‌ అవుతూ సహాయక చర్యలకు సిద్ధమయ్యారు.

గత 4-5 రోజులుగా తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ జిల్లాల్లో భారీ వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సోమవారం నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో 6.6 సెంమీ వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి, వికారాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జనగామ, వరంగల్, కరీంనగర్‌, నిర్మల్ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో కూడా సాయంత్రం భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమై, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Internal Links:

హైదరాబాద్‌లో భారీ వర్షాల హెచ్చరిక – ప్రజలు అప్రమత్తంగా ఉండండి!

ఏపీ ప్రభుత్వంతో సినీ ప్రముఖుల కీలక భేటీ

External Links:

నేడు తెలంగాణలో భారీ వర్షం.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *