హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇకపై రాష్టంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పనిచేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ యథావిధిగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. ప్రైమరీ మరియు అప్పర్ ప్రైమరీ స్కూల్ టైమింగ్స్‌తో సమానంగా హైస్కూల్ టైమింగ్ మార్చబడింది అని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (విద్య) బుర్రా వెంకటేశం ఇటీవల ఉన్నత పాఠశాలల వేళలను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉదయం 8.45 నుండి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు.