తెలంగాణ రాష్ట్రంలో చలి రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కనిష్ట, రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత ఆసిఫాబాద్ జిల్లాలో నమోదైంది. సిర్పూర్ (యు)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఇక, సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 8.8, ఆదిలాబాద్ జిల్లా బేలలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 15.1, సూర్యాపేటలో 15.6, వనపర్తి డిస్ట్రిక్ లో 15.9 డిగ్రీలుగా నమోదైంది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తుండటమే చలి తీవ్రత పెరగటానికి కారణమని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడూ రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని ఐఎండీ అంచనా వేస్తుంది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి.