Telangana TET Results

Telangana TET Results: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET) జూన్ సెషన్‌కు సంబంధించిన ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. మంగళవారం ఉదయం విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ పరీక్షలో మొత్తం పరీక్ష రాసిన అభ్యర్థుల్లో కేవలం 33.98 శాతం మంది మాత్రమే అర్హత సాధించినట్లు తెలిపారు. జూన్ 18 నుంచి 30 తేదీల మధ్య ఈసారి టెట్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. ప్రాథమిక ఫలితాలను జూలై 5న విడుదల చేసిన విషయం తెలిసిందే.

పేపర్ 1కు 63,261 మంది, పేపర్ 2కు 1,20,392 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. రెండు పేపర్లకు ఒకేసారి దరఖాస్తు చేసిన వారు సుమారు 15 వేల మంది ఉన్నారు. పేపర్ 1కు హాజరైన అభ్యర్థుల శాతం 74.65 కాగా, పేపర్ 2 (గణితం, సైన్స్)కు హాజరైన వారు 73.48 శాతంగా ఉంది. అలాగే పేపర్ 2 (సామాజిక అధ్యయనాలు)కు హాజరైన అభ్యర్థుల శాతం 76.73. ఫలితాల విడుదలతో అభ్యర్థులు తమ తదుపరి ప్రక్రియలకు సిద్ధమవుతున్నారు.

Internal Links:

యుఐడిఎఐ బిగ్ అలర్ట్..

ఆకాశాన్ని అంటుతున్న కూరగాయ ధరలు..

External Links:

తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *