Telangana tops organ donation

Telangana tops organ donation: తెలంగాణ అవయవదానంలో దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. 2024లో దేశవ్యాప్తంగా ప్రతి 10 లక్షల మందిలో సగటున 0.8 అవయవ దానాలు జరిగితే, తెలంగాణలో మాత్రం ఈ సంఖ్య 4.88కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ ప్రథమ స్థానాన్ని సాధించినందుకు రాష్ట్రానికి నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ (NOTTO) అవార్డు ఇచ్చింది. శనివారం ఢిల్లీలో జరిగిన జాతీయ అవయవ దాన దినోత్సవ వేడుకలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈ అవార్డును జీవన్‌దాన్ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆనందం వ్యక్తం చేశారు. అవయవాలు దానం చేయడం వల్ల మరొకరి ప్రాణం నిలబడతుందన్న దృష్టితో ఉమ్మడి రాష్ట్రంలో 2012లో జీవన్‌దాన్ ప్రారంభించామని గుర్తుచేశారు. అవసరమైన ప్రతివారికీ అవయవాలు అందేలా ఇటీవల తోట యాక్ట్‌ను అమలు చేసినట్లు చెప్పారు. బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను వృథా చేయకుండా దానం చేయాలని ప్రజలను కోరారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా అవయవ మార్పిడి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

జీవన్‌దాన్ ప్రారంభమైన తరువాత నుంచి అవయవ దానం చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2025 జులై వరకు 1,673 మంది డోనర్ల నుంచి 6,309 అవయవాలు సేకరించారు. వీటిలో కిడ్నీ, లివర్, హార్ట్, కార్నియా, హార్ట్ వాల్వ్, లంగ్స్, ప్యాంక్రియాస్‌లు ఉన్నాయి. 2024లో 188 డోనర్ల నుంచి 725 అవయవాలు సేకరించగా, 2025 జులై నాటికి 125 డోనర్ల నుంచి 464 అవయవాలు సేకరించడం గమనార్హం. ప్రతి ఏడాది 10 నుంచి 15 శాతం మేర డోనర్ల సంఖ్య పెరుగుతోంది. మొత్తం సేకరించిన అవయవాల్లో 2,516 కిడ్నీలు, 1,534 లివర్లు, 226 హార్ట్‌లు, 1,453 కార్నియాలు, 170 హార్ట్ వాల్వ్‌లు, 396 లంగ్స్, 14 ప్యాంక్రియాస్‌లు ఉన్నాయి. వాటిలో 40 శాతం కిడ్నీలు మాత్రమే కావడం విశేషం.

Internal Links:

ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. బస్సు చార్జీల తగ్గింపు..

ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్..

External Links:

అవయవ దానంలో తెలంగాణ ఫస్ట్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *