తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్య కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణారావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ప్రభుత్వం కె. రామకృష్ణారావును కొత్త సీఎస్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం కె. రామకృష్ణారావు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. సీనియారిటీ జాబితాలో ఆయనతో పాటు మరో ఆరుగురు అధికారులు రేసులో ఉన్నారు. అన్ని అంశాలను పరిశీలించిన ప్రభుత్వం రామకృష్ణారావును సీఎస్‌గా ఎంపిక చేసింది.