Latest News Telugu

News5am, Telugu Breaking Latest News (20-05-2025): హాంకాంగ్, సింగపూర్‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం భారత్‌లో 257 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు తెలిపారు. ఆందోళన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిడ్ పరిణామాలపై DGHS అధ్యక్షతన ఉన్నతాధికారుల సమావేశం జరిగింది.
NCDC, EMR, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, ICMR నిపుణులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. COVID పరిస్థితిపై సమీక్షలో నిపుణులు స్పందించారు. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితి దేశంలో నియంత్రణలో ఉందని తేల్చారు.
భారత జనాభాతో పోలిస్తే కేసుల సంఖ్య తక్కువగా ఉంది. ఇప్పటి కేసులన్నీ తేలికపాటివే అని నిపుణులు చెప్పారు. ఆసుపత్రి అవసరం లేని స్థాయిలో లక్షణాలు ఉన్నాయి. IDSP, ICMR సంస్థలు వైరస్ పర్యవేక్షణలో కృషి చేస్తున్నాయి. శ్వాసకోశ వైరస్‌లపై దేశం బలమైన పర్యవేక్షణ వ్యవస్థ కలిగి ఉంది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిత్యం పర్యవేక్షిస్తోంది. ప్రజల ఆరోగ్య రక్షణకు తగిన చర్యలు తీసుకుంటోంది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కొత్త కేసులు పెరుగుతున్నాయి. JN.1 వేరియంట్ వల్ల జ్వరం, అలసట, తలనొప్పి, గొంతునొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

More News:

కారు డోర్లు లాక్ అయి నలుగురు చిన్నారులు మృతి..

మరోసారి రంగంలోకి హైడ్రా..

More Telugu Breaking Latest News: External Sources

కరోనా కొత్త వేరియంట్.. పెరుగుతున్నకేసులు.. కేంద్రం అప్రమత్తం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *