Latest News All

News5am, Latest Telugu News (02/05/2025) : తెలంగాణలో డిగ్రీ కాలేజీలలో చేరాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఉన్నత విద్యామండలి చైర్మన్ బాల కృష్ణ రెడ్డి, కాలేజీ విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన కలిసి డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల (దోస్త్) 2025-26 నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ ప్రకటనతో రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు మార్గం వీలవుతుంది. ఈ సందర్భంగా చైర్మన్ బాల కృష్ణ రెడ్డి మాట్లాడుతూ, ఈసారి ప్రవేశాలు మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి విడత దరఖాస్తుల స్వీకరణ మే 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు.

అనంతరం మే 10వ తేదీ నుండి 22వ తేదీ వరకు విద్యార్థులకు వెబ్ ఆప్షన్లు ఇవ్వబడతాయని తెలిపారు. ఈ సమయంలో విద్యార్థులు తమకు ఇష్టమైన కళాశాలలు మరియు కోర్సులను ఎంచుకోవచ్చు. మొదటి విడత సీట్ల కేటాయింపు మే 29న జరగనుంది. తొలి సెమిస్టర్ తరగతులు జూన్ 30వ తేదీ నుండి ప్రారంభమవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 1057 డిగ్రీ కళాశాలలు ఉన్నప్పటికీ, వీటిలో 987 కళాశాలలు దోస్త్ పరిధిలోకి వస్తాయి. మిగిలిన 70 కళాశాలలు ఈ ప్రక్రియలో భాగమవ్వవు. ఈసారి ప్రవేశాల ప్రక్రియలో బకెట్ సిస్టమ్ అమలులో ఉండబోతుందని చైర్మన్ తెలిపారు. అదనంగా, ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్ విధానాన్ని అనుసరిస్తారు. మొత్తం 4,67,456 సీట్లు రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

Latest Telugu News

Latest Telugu News

హైదరాబాద్‌లో కమ్ముకున్న మేఘాలు..

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు..

More Latest News : External Sources

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ 2025 నోటిఫికేషన్ విడుదల..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *