తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు దాటింది. రాష్ట్రంలోని 7 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం, రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ఏడు జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రెడ్ అలర్ట్ ఇచ్చిన ఏడు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది.

గడిచిన రెండ్రోజుల్లో దాదాపు 8 మంది వడదెబ్బతో మృతి చెందినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిసర జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రత పెరిగి తీవ్ర ఉక్కపోత ఉండనుంది. ఉదయం 10 నుంచి 4 గంటల వరకు ప్రజలు బయటకు రాకుంటే మంచిదని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరం ఉంటేనే మధ్యాహ్నం బయటకు రావాలని ప్రజలకు ఐఎండీ సూచించింది. రైతులు, కూలీలకు వడదెబ్బ ప్రభావం ఉండే ఛాన్స్ ఉందని జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *