TG CPGET-2025 Exam: తెలంగాణలో వచ్చే నెల ఆగస్టు 4వ తేదీ నుంచి పీజీ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నట్టు అధికారులు తెలిపారు. TG CPGET-2025 పేరుతో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. వివిధ పీజీ కోర్సులు, డిప్లొమాలు, అలాగే ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలు ఏర్పాటు చేశారు. మొత్తం 44 సబ్జెక్టులకు గానూ ఆగస్టు 4 నుంచి 11, 2025 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుంది.
జూలై 31, 2025 నుంచి అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లు www.osmania.ac.in, https://cpget.tgche.ac.in లేదా www.ouadmissions.com వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి. గేట్ (GATE), జీప్యాట్ (GPAT) వంటి అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మొదట అడ్మిషన్‌కు పరిగణించనున్నారు. మిగిలిన ఖాళీలను CPGET ర్యాంక్ మరియు స్కోర్ ఆధారంగా భర్తీ చేస్తారని అధికారులు తెలిపారు. మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Internal Links:
బంగ్లాదేశ్ – పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటిన వాయుగుండం..
External Links:
తెలంగాణలో పీజీ ప్రవేశ పరీక్షల తేదీ వచ్చేసిందోచ్..