తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్పీ) గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు డిసెంబర్ 9, 2024 నుంచి తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. గ్రూప్ 2 పరీక్షలు డిసెంబర్ 15 మరియు 16, 2024 తేదీల్లో రెండు సెషన్లలో నిర్వహించనున్నాయి: ఉదయం మరియు మధ్యాహ్నం. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా, 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి రెండు గంటల ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 8:30 గంటల నుండి పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం కల్పిస్తాం అని (టీజీపీఎస్పీ) వెల్లడించింది. ఇతర వివరాలకు, అభ్యర్థులు 040-23542185 లేదా 040-23542187 నంబర్లను సంప్రదించవచ్చు అని తెలిపారు .
పరీక్షా షెడ్యూల్:
డిసెంబర్ 15, 2024: పేపర్-1: ఉదయం 10:00 నుండి 12:30 వరకు
డిసెంబర్ 15, 2024:పేపర్-2: మధ్యాహ్నం 3:00 నుండి 5:30 వరకు
డిసెంబర్ 16, 2024:పేపర్-3: ఉదయం 10:00 నుండి 12:30 వరకు
డిసెంబర్ 16, 2024:పేపర్-4: మధ్యాహ్నం 3:00 నుండి 5:30 వరకు